: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ శ్రీకాకుళం ఎంపీ లేఖ... కేంద్ర మంత్రి సమాధానం!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని గతంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ అంశంపై వచ్చిన లేఖను ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలిస్తుందని, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అనంతరం భారతరత్న ఎవరికి ఇవ్వాలనే అంశంపై ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారని వివరించారు. ప్రస్తుతం ఆ లేఖను తాము పీఎంవోకి పంపించామని తెలిపారు.