: నేను చేసేది ‘సత్యమేవ జయతే’ వంటి టీవీ షో కాదు: కమలహాసన్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘సత్యమేవ జయతే’లా తన టీవీ షో ఉండదని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. తమిళ్ వెర్షన్ ‘బిగ్ బాస్’కు ప్రముఖ నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడారు. ‘సామాజిక అంశాలపై ‘సత్యమేవ జయతే’ వంటి టీవీ షోలు ఉండగా మళ్లీ, అదే తరహా టీవీ షో ఎందుకు?’ అని కమల్ ను ప్రశ్నించగా..‘‘సత్యమేవ జయతే’ హోస్ట్ చేస్తున్న వ్యక్తి కంటే నేను సమాజం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నా. తమిళ్ వెర్షన్ ‘బిగ్ బాస్’ టీవీ షో ద్వారా ప్రతి గృహిణికి సాయ పడనుంది. ఈ టీవీ షో విస్తృతి చాలా పెద్దది’ అని చెప్పారు.