: ఈజిప్టులో క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగుల కాల్పులు... 23 మంది మృతి


ఈజిప్టులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్య‌క్తులు క్రైస్త‌వుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 25 మందికి తీవ్రగాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఓ బస్సులో వెళుతుండ‌గా ఈ కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. వారంతా దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌ అన్బా శామ్యూల్‌ మొనాస్టరీకి వెళుతున్నార‌ని చెప్పారు. పరారీలో ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈజిప్టులో ఇటీవ‌ల కోప్టిక్‌ క్రైస్తవులపై తీవ్రవాదుల దాడులు ఎక్కువ‌య్యాయి.
                           

  • Loading...

More Telugu News