: ఇది బెల్టు షాపా? సమస్య ఉంటే చర్యలు తీసుకుంటాం: యువకుడి ట్వీట్ కు లోకేష్ స్పందన


ప్రకాశం జిల్లాకు చెందిన నరసింహారావు చౌదరి అనే యువకుడు తమ గ్రామంలో బెల్టు షాపు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ కు ట్వీట్ చేశాడు. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలంలో ఉన్న కంబాలదిన్నె గ్రామానికి చెందిన నరసింహారావు చౌదరి తమ గ్రామంలో బెల్టు షాపు కారణంగా చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆ బెల్ట్ షాపు ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్ పై లోకేష్ స్పందిస్తూ, ‘ఇది బెల్టు షాపా?’ సమస్య ఉంటే, ఈ విషయమై స్థానిక అధికారులను అప్రమత్తం చేసి, చర్యలు తీసుకునేలా చేస్తా’ అని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News