: ఈ రోజు సాయంత్రం నా అభిమానులను సర్ ప్రైజ్ చేస్తా: దర్శకుడు వర్మ


తన ట్వీట్లతో సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తనను ఫాలో అయ్యే ట్విట్టర్ అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నట్టు ఈ రోజు ట్వీట్ చేశారు. ‘నా ట్విట్టర్ ఖాతా ఫాలోవర్స్ అందరికీ ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఉల్లాసాన్నిచ్చే అప్రియమైన సర్ ప్రైజ్’ అని వర్మ పేర్కొన్నారు. ఆ అప్రియమైన సర్ ప్రైజ్ ఏంటనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

  • Loading...

More Telugu News