: బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల ముందు మరో బంపర్ ఆఫర్ ను ఉంచిన ఎయిర్‌టెల్
తమ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల ముందు భారతీ ఎయిర్‌టెల్ అదనపు డేటా ఆఫర్లను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లో 1000 జీబీ వరకు అదనపు డేటా అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ బోనస్ ఆఫర్ వివరాలు ఎయిర్ టెల్ వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ ఇప్పటికే ఢిల్లీలో అమలులో ఉంది. ఇప్పుడు అన్ని నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. గతంలో రూ.899 ప్లాన్‌తో ఎయిర్‌టెల్ 30 జీబీ అందించేది, కానీ ఇప్పుడు 60 జీబీ వేగవంతమైన డేటాను అందిస్తోంది. అదే రూ.1099తో గతంలో 50 జీబీని అందించిన ఎయిర్‌టెల్ ఇప్పుడు 90 జీబీ అందిస్తోంది. అలాగే ఇప్పుడు రూ .1299 ప్లాన్ తో 75 జీబీకి బదులుగా 125 జీబీ అందుకోవచ్చు. ఇక రూ .1499 ప్లాన్ ప్రకారం గతంలో 100 జీబీ పొందే యూజర్లు ఇప్పుడు 160 జీబీ పొందుతున్నారు. అలాగే ఈ ప్లాన్‌లను యాక్టివ్ చేసుకున్న వారు అదనంగా 1000 జీబీని ఉచితంగా అందుకోవచ్చు. దాంతో పాటు అపరిమిత లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ కూడా ఉచితంగా పొందవచ్చు.