: మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.. ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిద్రలోకి జారుకున్న కర్ణాటక సీఎం
ఏదో ఒక ఘటన లేదా కారణంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వార్తల్లోకి ఎక్కడం ఈ మధ్యన పరిపాటిగా మారింది. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మరో నేత మాట్లాడుతుండగా... ఆయన తనకేమీ పట్టనట్టు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయన నిద్రపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.