: తెలంగాణ నుంచి పద్మభూషణ్ పురస్కారానికి విజయనిర్మల పేరు సిఫార్సు!
ప్రముఖ దర్శకురాలు, గిన్నిస్ రికార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల పేరును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి సిఫార్సు చేయనుంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా వెల్లడించారు. ఈ ఉదయం విజయనిర్మలకు రాయల్ అకాడమీ డాక్టరేటును ప్రదానం చేయగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న తలసాని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో కలసి ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో అతిపెద్ద పద్మ పురస్కారానికి విజయనిర్మల తగినవారని అభివర్ణించారు. ఆమె పేరును కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.