: 24 గంటల్లో ఏడుగురిపై అత్యాచారం...యోగీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు!
గడచిన 24 గంటల్లో ఏడుగురిపై సామూహిక అత్యాచారం జరగడం ఉత్తరప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుధ్ నగర్ జిల్లా సోవాటా దగ్గర అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును చూసేందుకు వెళ్తున్న కుటుంబంపై దాడి చేసి, అందులోని నలుగురు మహిళలపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి, వారి నుంచి నగదు, నగలు దోచుకున్న సంఘటన తెలిసిందే. మరో ఘటనలో ముజఫర్ నగర్ లో ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. మరో ఘటనలో భర్తను చెట్టుకు కట్టేసి, భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ సందర్భంగా వారు చేసిన హింసకు తాళలేకపోయిన మహిళను అటుగా వెళ్తున్న వారు కాపాడారు. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. యూపీలో ఆటవిక పాలన సాగుతోందని మండిపడుతున్నారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్యాంగ్ రేప్ లు పెరిగిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. యోగి ప్రవేశపెట్టిన యాంటీ రోమియో స్క్వాడ్ ఏమైంది? ఇతర షీ టీములు ఏం చేస్తున్నాయని మహిళా సంఘాలు, విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.