: 'నా మనవడికి, మనవరాలికి నామకరణం ఫంక్షన్'... తప్పక రావాలని గవర్నర్ కు నాయిని ఆహ్వానం
తన మనవడు, మనవరాలికి నామకరణం, డోలోహరణం కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టానని, ఆ పండగకు తప్పకుండా రావాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆహ్వానించారు. నిన్న గవర్నర్ ఇంటికి వెళ్లిన ఆయన ఆహ్వాన పత్రికను ఇచ్చి కార్యక్రమానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరారు.
కాగా, ఇటీవల నాయిని కుమారుడికి కవలలుగా ఓ బాబు, పాప జన్మించిన సంగతి తెలిసిందే. దీంతో నాయిని ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియగా, అదే ఉత్సాహంతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్ లో నామకరణం, ఉయ్యాలలో వేసే ఉత్సవాన్ని వైభవంగా జరిపించేందుకు నాయిని కుటుంబం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సీఎం సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.