: టీవీ యాంకర్ రవిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు


ప్రముఖ టీవీ యాంకర్ రవిపై హైదరాబాదులోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. యువనటుడు నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్ లో నటుడు చలపతిరావు, యాంకర్ రవి మహిళలను కించపరుస్తూ మాట్లాడారని ఆరోపిస్తూ ఈ నెల 23న మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అదే రోజు చలపతిరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు, యాంకర్ రవిపై న్యాయసలహా అనంతరం క్రిమినల్ కేసు నమోదు చేశారు.

 మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను యాంకర్‌ రవిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. బండ్లగూడకి చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 ఏ (IV), 509 సెక్షన్ల కింద యాంకర్ రవిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో చలపతిరావుపై ఇదే ఆరోపణలపై మరో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News