: పందిమాసం ఆలస్యంగా వండిందని కిరోసిన్ పోసి నిప్పటించబోయిన భర్త
పందిమాంసం కూర కోసం భార్యను చంపబోయిన భర్తపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు, మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహమైంది. రఘు పందిమాంసం వ్యాపారి వద్ద పని చేస్తుండగా, సుజాత పలు ఇళ్లలో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటకు ఇంటికి చేరిన రఘు... భార్యకు పంది మాంసం ఇచ్చి వంటచేయాలని ఆదేశించాడు. అయితే వంట ఆలస్యంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన రఘు... ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పటించబోయాడు. దీంతో అతని బారి నుంచి తప్పించుకున్న సుజాత నేరుగా వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.