: ఇదో అద్భుతం...ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు అధిరోహించాడు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం మహాయజ్ఞం లాంటింది. ఎత్తు పెరిగే కొద్దీ ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. వాతావరణం అనుకూలించదు. పూర్తి ప్రతికూల పరిస్థితులు, దారీతెన్ను తెలియని గమ్యంవైపు గుడ్డిగా సాగిపోవడమే. అలాంటి అత్యంత ప్రమాదకరమైన సాహసాన్ని సిక్కిం వాసి ఆక్సిజన్ ను వెంట తీసుకెళ్లకుండా ఎవరెస్టు అధిరోహించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
సిక్కింవాసి కెల్సాంగ్ డోర్జీ భూతియా ఇలా ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు ఎక్కి రికార్డు నెలకొల్పారు. ఎవరెస్టు అధిరోహించే క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రమాదకర డెత్ జోన్ లోనే ఆయన రెండు రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చిందని సిక్కిం పర్వతారోహక సంఘం (ఎస్‌ఎంఏ) తెలిపింది. ఈనెల 17న ఎవరెస్టు అధిరోహణకు వెళ్లిన ఆయన 21 (ఆది వారం) ఉదయం శిఖరాగ్రానికి చేరుకున్నారు.