: గొడవ జరుగుతుంటే తనకు సపోర్ట్‌గా రాలేదని.. స్నేహితుడిని పొడిచి చంపిన కిరాతకుడు


ఓ విషయంలో వేరే వాళ్లతో వాగ్వాదం జరుగుతుంటే స్నేహితుడు తనకు సపోర్ట్ చేయకుండా దూరంగా నిల్చున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని చంపేశాడో కిరాతకుడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మధు విహార్ ప్రాంతానికి చెందిన సాజిద్ (23) గత రాత్రి కొందరు స్థానికులతో చిన్న విషయమై గొడవపడుతున్నాడు. ఆ సమయంలో అతడి పక్కనే ఉన్న స్నేహితుడు బాబు.. ఆ గొడవను పట్టించుకోకుండా కొంత దూరంలో నిల్చున్నాడు. గొడవ ముగిశాక బాబు దగ్గరికి వచ్చిన సాజిద్ గొడవ జరుగుతుంటే తనకు మద్దతుగా రాకుండా దూరంగా ఎందుకు నిల్చున్నావంటూ నిలదీశాడు. పట్టరాని ఆవేశంతో స్నేహితుడిని పొడిచి చంపేశాడు. సాజిద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News