: ‘నన్ను క్షమించు’.. మాంచెస్టర్ దాడికి ముందు సూసైడ్ బాంబర్ అన్న మాటలివి!


బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి ముందు సల్మాన్ అబేదీ తనను క్షమించమని వేడుకున్నట్టు తెలిసింది. దాడికి ముందు సల్మాన్ తన బంధువు ఒకామెకు ఫోన్ చేసి మాట్లాడాడు. చివరిలో ‘‘నన్ను క్షమించు’’ (ఫర్‌గివ్ మి) అని పేర్కొన్నట్టు ఆమె తెలిపారు.

బ్రిటన్‌లో అరబ్బులను చూస్తున్న తీరు సల్మాన్‌కు నచ్చలేదని, ముఖ్యంగా గతేడాది జరిగిన తన ముస్లిం స్నేహితుడి హత్యను జీర్ణించుకోలేకపోయాడని ఆమె తెలిపారు. దేశంలో ముస్లింలను, అరబ్బులను ఎందుకంత క్రూరంగా చంపుతున్నారని ప్రశ్నించిన ఆమె.. మాంచెస్టర్ దాడికి తీవ్రమైన ఆవేశమే కారణమని అన్నారు. లిబియా నుంచి ఫోన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రస్తుతం తన భద్రత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News