: పావురంతో డ్రగ్స్ స్మగ్లింగ్... పట్టుకున్న పోలీసులు!
డ్రగ్స్ అక్రమంగా సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారనే వార్తలు వినడం కామనే. కానీ, ఈ పని చేస్తున్న ఓ పావురాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం నమ్మశక్యంగా అనిపించదు కానీ వాస్తవం. కువైట్ కి సరిహద్దు ప్రాంతమైన ఇరాన్ నుంచి ఓ పావురం రావడం గమనించారు. ఇది కువైట్ వైపు వెళుతుండటాన్ని చూసిన పోలీసులు, మొదట అంతగా పట్టించుకోలేదు. కానీ, ఓ చిన్న బ్యాగ్ లాంటిది పావురం వెనుక తగిలించి ఉండటాన్ని గమనించారు. వెంటనే దాన్ని పట్టుకుని ఆ బ్యాగ్ విప్పి చూశారు. అందులో, డ్రగ్స్ ఉన్నాయి. దీంతో, డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.