: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు.. ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన కోహ్లీ సేన


వ‌చ్చేనెల 1 నుంచి ఇంగ్లండ్‌లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అందులో పాల్గొనేందుకు బ‌య‌లుదేరిన  టీమిండియా ఈ రోజు మధ్యాహ్నం ఇంగ్లండ్‌ చేరుకుంది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపిన‌ బీసీసీఐ.. కోహ్లీ సేన‌ ఫొటోను కూడా పోస్టు చేసింది. ఈ టోర్నీకి ముందు టీమిండియా రేపు త‌న తొలి వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మొద‌టి మ్యాచ్ ఇంగ్లండ్, బంగ్లాదేశ్ టీమ్‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. వ‌చ్చే నెల 4న పాకిస్థాన్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది.



  • Loading...

More Telugu News