: ఏపీ ప్రభుత్వం అవినీతిమయం: కావూరి సాంబశివరావు


ఏపీ సీఎం చంద్రబాబుపైన, ఆయన ప్రభుత్వంపైన బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోందని, ఆయన ప్రభుత్వం అవినీతిమయమైందని ఆరోపించారు. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షాతో భేటీ అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జన్మభూమి కమిటీల తీరు అధ్వానంగా ఉందని, ఈ కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షం కనుక, ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీపై పడుతుందని, ఏ విషయంలోనూ బీజేపీని టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, నిబద్ధత కలిగిన నేతల వ్యాఖ్యలపైనే తాను స్పందిస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News