: బాలీవుడ్ లో నటించాలనే కోరిక ఉంది... కానీ డ్యాన్స్ రాదు!: బ్రాడ్ పిట్


హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ఇండియాలో పర్యటిస్తున్నాడు. తన తాజా చిత్రం 'వార్ మెషీన్' ప్రమోషన్ లో భాగంగా ఆయన భారత్ కు వచ్చాడు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా బ్రాడ్ పిట్ మాట్లాడుతూ, తనకు బాలీవుడ్ లో నటించాలనే ఉందని... అయితే డ్యాన్స్ రాని కారణంగా తాను ఎన్నటికీ నటించలేనని చెప్పాడు. దీంతో, షారుఖ్ కల్పించుకుని... రెండు చేతులను ఒక సారి ముందుకు, ఆ తర్వాత పక్కకు చాచిపెట్టు... అదే డ్యాన్స్ అయిపోతుంది అని సూచించాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. 

  • Loading...

More Telugu News