: నా సినిమాకు, ‘బాహుబలి-2’కు అసలు పోలికే లేదు: ఆమిర్‌ ఖాన్‌


భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టిస్తోన్న ‘దంగల్‌’, ‘బాహుబలి-2’ సినిమాలపై బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్ స్పందించారు. త్వ‌ర‌లోనే ‘బాహుబ‌లి-2’ చైనాలో విడుద‌ల కానుండ‌గా ‘దంగ‌ల్’ ఇప్ప‌టికే విడుద‌లై ఆ దేశంలో వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్‌కు చేరువలో ఉంది. ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ ప్రీమియర్‌ షోకు వచ్చిన ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. తాను న‌టించిన దంగ‌ల్ సినిమాకు చైనాలో వ‌స్తున్న స్పంద‌న ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. అయితే త‌న‌ సినిమాకు, ‘బాహుబలి-2’కు అసలు పోలికే లేదని అన్నాడు.

 ‘బాహుబలి- 2’ను తాను ఇంకా చూడ‌లేద‌ని రిపోర్ట్స్‌ మాత్రం వింటున్నానని ఆమిర్ ఖాన్ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు భారతీయ సినిమాలు దూసుకువెళుతుండ‌డం త‌న‌కు చాలా ఆనందానిస్తోంద‌ని, అంతమాత్రాన ఈ రెండింటినీ పోల్చలేమ‌ని అన్నారు. దేని స్పేస్‌ దానికి ఉందని అన్నాడు. బాహుబ‌లి-2 ఘ‌న విజ‌యం సాధించినందుకు ఆ సినిమా ద‌ర్శ‌కుడు రాజమౌళికి, అతని బృందానికి అభినందనలు తెలుపుతున్నాన‌ని చెప్పాడు.                    

  • Loading...

More Telugu News