: అనారోగ్యం కారణంగా అరగంటకు మించి నిలబడలేకపోయేదాన్ని: నటి స్నేహా ఉల్లాల్
అనారోగ్యం కారణంగా అరగంటకు మించి నిలబడలేకపోయేదాన్నని, అందుకే, నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని నటి స్నేహా ఉల్లాల్ చెప్పింది. ప్రస్తుతం అనారోగ్యం బారి నుంచి బయటపడ్డ స్నేహా ఉల్లాల్ ‘ఆయుష్మాన్ భవ’ సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను చాలాకాలంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడ్డానని చెప్పింది. ఈ డిజార్డర్ రక్త ప్రసరణకు సంబంధించిన సమస్య అని, దీంతో, తాను పూర్తిగా బలహీన పడిపోయానని చెప్పింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సినిమాలు చేయడంతో తాను మరింత బలహీన పడిపోవడంతో చికిత్స నిమిత్తం నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది.