: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 'కేసీఆర్ కిట్'లో ఉండే వస్తువులు ఏమిటంటే... !


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపణీ చేయనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి ఈ కిట్ల పంపిణీ ప్రారంభమవుతుందని అన్నారు. నవజాత శిశువుల కోసం పదకొండు రకాల వస్తువులు, తల్లుల కోసం నాలుగు రకాల వస్తువులు ఈ కిట్ ద్వారా అందజేయనున్నట్టు చెప్పారు. ఇక, కేసీఆర్ కిట్ లో ఉండే వస్తువుల గురించి చెప్పాలంటే, నవజాత శిశువుల కోసం దోమతెర, బేబీ మాస్కిటోస్, దుస్తులు, రెండు టవల్స్, బేబీ న్యాప్ కిన్స్, జాన్సన్ బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, బేబీ సోప్ బాక్స్, ఆట వస్తువులు ఉంటాయి. తల్లుల కోసం రెండు చీరలు, రెండు సబ్బులు, కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్ ఉంటాయి.

  • Loading...

More Telugu News