: చైనాలో విడుదలకు సిద్ధమైన ‘బాహుబలి 2’: తరణ్ ఆదర్శ్
భారత్లోనే కాక ఓవర్సీస్లోనూ సత్తా చాటుతున్న ‘బాహుబలి-2’ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఇంకా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ సినిమా ఊహించని స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక బాహుబలి-2 చైనాలోనూ విడుదల కావడానికి సిద్ధమైందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు. ఏ తేదీన, ఎన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుందన్న విషయం తెలియాల్సి ఉంది. బాలీవుడ్ సినిమా ‘దంగల్’ ఇటీవలే చైనాలో విడుదలై భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఆ సినిమాను మొత్తం 9000 స్క్రీన్లలో విడుదల చేశారు.
#Baahubali2 release in China: No specific release date has been finalised yet... However, makers are looking at an earliest date possible...
— taran adarsh (@taran_adarsh) 25 May 2017
Lots of speculation about #Baahubali2 release in China... The update: #Baahubali2 makers have started the process of releasing in China...
— taran adarsh (@taran_adarsh) 25 May 2017