: అంతరిక్ష ప్రయోగాలలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్


పలుదీవులతో కూడిన న్యూజిలాండ్ అంతరిక్ష ప్రయోగాలలోకి అడుగుపెట్టింది. అంతరిక్షం వ్యాపారంలో అమెరికాలోని రాకెట్ ల్యాబ్‌ కంపెనీ కి చెందిన ఎల‌క్ట్రాన్ రాకెట్‌ ను మ‌హియా దీవి నుంచి విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. 17 మీటర్ల పొడవైన ఈ రాకెట్ 225 కేజీల బరువైన ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టగలుగుతుంది. ఈ ఎల‌క్ట్రాన్ రాకెట్ చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ ల్యాబ్ కు సంబంధించిన మరిన్ని రాకెట్లను ప్ర‌యోగించడం ద్వారా న్యూజిలాండ్ కూడా స్పేస్ మార్కెట్‌ లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఈ ప్రయోగం నాలుగు రోజుల క్రిందటే చేయాల్సి ఉన్నప్పటికీ వాతావరణం సహకరించకపోవడంతో దీనిని ప్రయోగించేందుకు నాలుగు రోజులు ఆలస్యం అయింది.

  • Loading...

More Telugu News