: భారత బిడ్డకు స్వాగతం... నీకు జరిగిన అన్యాయానికి సారీ: సుష్మా స్వరాజ్
బలవంతంగా పాకిస్థాన్ యువకుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చి, ఆపై ఇస్లామాబాద్ లో దౌత్యాధికారుల సాయంతో ఇండియాకు వెళ్లేందుకు కోర్టు నుంచి అనుమతి పొందిన ఢిల్లీ యువతి ఉజ్మా కొద్దిసేపటి క్రితం వాఘా సరిహద్దు ద్వారా భారత్ లోకి ప్రవేశించింది. ఆమెను భారత పుత్రికగా అభివర్ణించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ "ఉజ్మా... భారత పుత్రికకు సుస్వాగతం. నీకు జరిగిన అన్యాయానికి నేను క్షమాపణలు చెబుతున్నా" అని ట్వీట్ చేశారు.
ఉజ్మా విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిత్యమూ దౌత్యాధికారులతో మాట్లాడుతూ, కేసును కోర్టు దాకా తీసుకెళ్లి విజయం సాధించడంలో సుష్మా ఎంతో చొరవ చూపారు. కాగా, నిన్న ఇస్లామాబాద్ హైకోర్టు ఉజ్మా తిరిగి ఇండియాకు వెళ్లేందుకు అనుమతించి, వాఘా వరకూ సెక్యూరిటీని ఇచ్చి పంపాలని తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.