: కేసీఆర్! 'రాజీనామా' సవాల్ కు సిద్ధమా?... రూ. లక్ష కోట్ల కేంద్రం నిధులపై ఆధారాలతో వచ్చిన లక్ష్మణ్


తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. లక్ష కోట్లు ఇచ్చామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తమ పార్టీ కట్టుబడి వుంటుందని, అన్ని వివరాలనూ గణాంకాలతో సహా నిరూపిస్తానని ఆ పార్టీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. కేంద్రం రూ. లక్ష కోట్లు ఇవ్వలేదని, నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాటమీద నిలబడతారా? అని లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై అన్ని ఆధారాలూ చూపిస్తామని, కేసీఆర్ మాటపై నిలబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రం నుంచి అందిన నిధుల వివరాలతో కూడిన దస్త్రాలతో లక్ష్మణ్ మీడియా ముందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News