: జడేజా సవాల్ ను స్వీకరించి, కూతురి కోసం లుక్ మార్చానన్న సురేష్ రైనా!
ఐపీఎల్ సీజన్-10 ఆరంభంలో సరికొత్త లుక్ లో సహచరులకు కనిపించిన రవీంద్ర జడేజా వారికి 'బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్' ను విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ ను పలువురు ఆటగాళ్లు స్వీకరించి, తమ లుక్ ను మార్చుకున్నారు. ఐపీఎల్ ముగియడంతో టీమిండియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్ సురేష్ రైనా తాజాగా 'బ్రేక్ ద బియర్డ్' ఛాలెంజ్ ను స్వీకరించాడు. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రాంలో సరికొత్త లుక్ ను పోస్టు చేశాడు. తన కుమార్తె కొసం లుక్ మార్చానని రైనా చెప్పాడు. రైనా కొత్త లుక్ ను మీరు కూడా చూడండి.