: మా సైనిక పోస్టులను తుపాకులు ధ్వంసం చేయలేవు.. పాక్ వీడియో ఫేక్.. స్పష్టం చేసిన ఇండియన్ ఆర్మీ!


భారత సైనిక  పోస్టులు శత్రు దుర్భేద్యమైనవని, వాటిని తుపాకులు ధ్వంసం చేయలేవని భారత ఆర్మీ ప్రకటించింది. నౌషేరాలోని భారత సైనిక పోస్టులను ధ్వంసం చేసినట్టు పాకిస్థాన్ ఆర్మీ విడుదల చేసిన వీడియోపై స్పందించిన ఆర్మీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో ఒక నకిలీ వీడియో అని తేల్చి పారేసింది. ఎడిట్ మార్కులు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. భారత ఆర్మీ సైనిక స్థావరాల గోడలు చాలా దృఢంగా ఉంటాయని, వాటిని రికోయిలెస్ గన్స్ ఏమీ చేయలేవని స్పష్టం చేసింది.

పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజు పాకిస్థాన్ ఆర్మీ 87 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.‘‘మే 13న భారత ఆర్మీ అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. దీనికి ప్రతీకారంగా నౌషేరాలోని భారత సైనిక పోస్టులను పాక్ ఆర్మీ ధ్వంసం చేసింది’’ అని అందులో పేర్కొంది. ఈ వీడియోపై స్పందించిన ఇండియన్ ఆర్మీ అది ‘ఫేక్’ అని కొట్టిపారేసింది.

  • Loading...

More Telugu News