: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో సునామీ హెచ్చరిక కేంద్రం.. భారత్ యత్నాలు!


వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో సునామీ హెచ్చరికల కేంద్రాన్ని నెలకొల్పేందుకు  భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో చైనా కూడా పాలుపంచుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ చైనా సీలో భారత్ ఏర్పాటు చేయబోయే ముందస్తు సునామీ హెచ్చరికల కేంద్రం వల్ల వియత్నాం, థాయ్‌లాండ్, మలేసియా వంటి దేశాలకు ప్రయోజనం కలగనుంది. ఆగ్నేయ, దక్షిణాసియా దేశాలకు సునామీ హెచ్చరికలు పంపేందుకు భారత్ ఇప్పటికే ఓ వ్యవస్థను కలిగి ఉందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ తెలిపారు.

ఇప్పుడు దానిని దక్షిణ చైనా సముద్రానికి కూడా విస్తరించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు మంజూరు కాలేదన్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టం ఫర్ ఆసియా అండ్ ఆఫ్రికా (ఆర్ఐఎంఈఎస్) ద్వారా సునామీ హెచ్చరికలు జారీ అవుతాయని, దీనివల్ల వియత్నాం, థాయిలాండ్ వంటి తీర దేశాలకు పలు ప్రయోజనాలు ఉంటాయని రాజీవన్ వివరించారు.

  • Loading...

More Telugu News