: ట్రంప్ కు ఏం పెడతారేమిటి?: ట్రంప్ భారీ కాయంపై మెలానియాతో పోప్ జోక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ కాయంపై క్యాథలిక్కుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ జోక్ చేశారు. ఇజ్రాయిల్ పర్యటన ముగించుకుని రోమ్ వచ్చిన ట్రంప్ కుటుంబ సమేతంగా పోప్ ఫ్రాన్సిస్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ కు తన కుటుంబాన్ని ట్రంప్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా శాంతి స్థాపనకు అధ్యక్ష పదవిని వినియోగించాలని సూచించారు. తర్వాత సరదాగా ముచ్చటిస్తూ, మెలానియాను ఉద్దేశించి, 'మీరు ఆయనకు ఏం పెడతారు?' అని అడిగారు. మెలానియా నవ్వగా, పోప్ కల్పించుకుని... 'పోటిజ్జాను పెడతారా?' అని అడిగారు. పోటిజ్జా అనే ఆహారపదార్థం అత్యధిక కేలరీలు లభించే ఆహారపదార్థం... ఇది మెలానియా సొంత దేశమైన స్లొవేనియాలో విరివిగా దొరుకుతుంది.