: నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని కోర్టు కెక్కిన సూర్య, శరత్ కుమార్
జర్నలిస్టులను దూషించిన కేసులో నీలగిరి కోర్టు ప్రముఖ కోలీవుడ్ నటులు సూర్య, శరత్ కుమార్ సహా మరో 8 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటులు నీలగిరి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమపై జారీచేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. వారి తరపున విశ్వనాథ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, 2009లో జర్నలిస్టులను కించపరిచే విధంగా దూషించారంటూ దాఖలైన కేసులో విచారణకు హాజరు కానందున వారికి నీలగిరి జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.