: ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్పాలి... లేకపోతే ఉద్యోగం రాదు: కలెక్టర్ ఆమ్రపాలి


ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పాలని, అలా చెప్పకపోతే ఉద్యోగం రాదని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి సూచించారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డులో జరిగిన జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగ యువతనుద్దేశించి ఆమె మాట్లాడుతూ, అబద్ధం చెప్పాలి కదా అని మార్కులు, విద్యాసంవత్సరాలు వంటి వాటిపై అబద్ధాలు చెప్పకూడదని సూచించారు. పని చేయగల సామర్థ్యం విషయంలో అబద్ధాలు ఆడాలని చిట్కా చెప్పారు.

ఐదు నిమిషాలే పని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.... రెండు గంటలు చేస్తామని చెప్పాలని సూచించారు. పనిని నిబద్ధతతో చేయాలని, ఆత్మవిశ్వాసంతో అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలని అన్నారు. ఇంటర్వ్యూ టీం అడిగే ప్రశ్నలకు తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని సూటిగా చెప్పాలని అన్నారు. సామర్థ్యం గురించి ప్రశ్నలకు మాత్రం కొన్ని అబద్ధాలు చెప్పే అవకాశం ఉందని ఆమె నిరుద్యోగులకు సూచించారు.

  • Loading...

More Telugu News