: అమిత్ షా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు: బీజేపీ నేత లక్ష్మణ్


అమిత్ షా గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్ కు లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాట తప్పే చరిత్ర కేసీఆర్ దని, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అసోం, మణిపూర్, హరియాణలో లాగే తెలంగాణలో కూడా గెలుస్తామని లక్ష్మణ్ దీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News