: కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడం: బీజేపీ నేత కిషన్ రెడ్డి


తెలంగాణ సీఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే పార్టీ బీజేపీ కాదని ఆ పార్టీ నేత  కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దళితుడి సీట్లో సీఎంగా కూర్చున్న కేసీఆర్, వారిని అవమానించారని మండిపడ్డారు. ‘ఢిల్లీలో ఉన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు.. మోదీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్లు ఎంత పోరాటం చేశారో, అంతకు పదింతలు మేమూ పోరాడాం. నాడు ‘మిలియన్ మార్చ్’, ‘సాగరహారం’, ‘రైల్ రోకో’, ఢిల్లోలీ ధర్నా చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు?. అటువంటి కేసీఆర్, బీజేపీని విమర్శిస్తారా?’ అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

  • Loading...

More Telugu News