: నేను చెబుతున్న లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా: తెలంగాణ సీఎం కేసీఆర్


తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్న‌ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. అమిత్ షా చెప్పిన అసత్యాల ప‌ట్ల‌ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ రోజు తాను చెప్పిన లెక్క‌లే తప్పని నిరూపించాలని ఆయ‌న స‌వాలు విసిరారు. తాను చెప్పిన లెక్క‌లు అస‌త్యాల‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని అన్నారు. అమెజాన్‌, గూగుల్ లాంటి ఎన్నో సంస్థ‌లు హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని, కొన్ని కోట్ల విదేశీ మారకాన్ని సంపాదించి కేంద్ర ప్ర‌భుత్వానికి ఇస్తున్నామ‌ని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే కాదు, ఏ ప్ర‌భుత్వం ఉన్నా తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిందేన‌ని, ఆ ప్ర‌కార‌మే బీజేపీ ప్రభుత్వం ఇస్తుంద‌ని, అంతేగానీ అద‌నంగా ఏమీ ఇవ్వ‌లేద‌ని అన్నారు.

అమిత్ షా రాజ‌కీయ ప్రేరేపిత‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని కేసీఆర్ అన్నారు. లెక్కలు ఒకలా ఉంటే అమిత్ షా మరోలా ప్రచారం చేస్తున్నారని, తప్పులు ప్రచారం చేయ‌డమేంట‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు. కేంద్ర పథకాలు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో చేరడం లేదని అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వ తీరు బాగోలేదని అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి పింఛన్లు ఇచ్చే గతే లేదని అమిత్ షా అన్నారని, అలా అనడంతో అసలు అర్థమేలేదని కేసీఆర్ అన్నారు.                    

  • Loading...

More Telugu News