: సెక్రటేరియట్ తరలింపు ఓ తుగ్లక్ చర్య: మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ సచివాలయాన్ని ఇప్పుడు ఉన్న చోట నుంచి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు తరలించాలనుకోవడం తుగ్లక్ చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్ ను కాపాడాలంటూ స్థానికంగా ఉంటున్న వాకర్స్ ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి శశిధర్ రెడ్డి హాజరై... ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఎంతో మంది క్రీడల్లో శిక్షణ తీసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వాకర్స్ తో కలిసి పరేడ్ గ్రౌండ్స్ ను కాపాడుకుంటామని చెప్పారు.