: ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే.. తొలిమ్యాచ్ పాక్‌తో ఆడనున్నాం: ఛాంపియన్స్ ట్రోఫీపై కోహ్లీ
వచ్చేనెల 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ రోజు ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం టీం అన్ని విభాగాల్లో బాగుందని చెప్పాడు. గ్రూప్‌లో టాప్‌లో ఉండడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. వచ్చేనెల 4న పాక్‌తో ఇండియాకు తొలి మ్యాచ్ ఉందని చెప్పాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించి, కప్పు కొట్టినట్లే ఈ సారి కూడా రాణించి అన్ని మ్యాచుల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, ధావన్, అశ్విన్, జడేజా బాగా ఆడారని గుర్తు చేశాడు. ఈ టోర్నీలో అన్నీ టాప్ టీమ్‌లే పాల్గొంటాయి కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుందని చెప్పారు.