: ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం భేటీ.. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై చర్చ
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దీంతో ఎన్డీఏ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి పళనిస్వామి మద్దతు తెలపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మోదీతో భేటీ తరువాత పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపడం పట్ల త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ రెండుగా విడిపోయి, అందులో ఒక దానికి పన్నీర్ సెల్వం నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల పన్నీర్ సెల్వం కూడా ప్రధాని మోదీని కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం తాము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తామని కూడా అన్నారు.