: తన కాన్వాయ్ ను ఆపేసి, అంబులెన్స్ కు దారి ఇచ్చిన ప్ర‌ధాని మోదీ!


భారత్‌లో వీఐపీ కల్చర్‌కు ఇక గుడ్‌బై చెప్పాల‌ని పేర్కొన్న ప్ర‌ధాన‌మంత్రి పిలుపు మేరకు కేంద్ర స‌ర్కారు ఇటీవలే ఎర్రబుగ్గ వాడకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎంతో మంది ప్ర‌ముఖులు ఇప్ప‌టికే త‌మ కార్ల‌పై ఎర్ర‌బుగ్గ‌ల‌ను తొల‌గించుకున్నారు. ప్ర‌తి ఇండియన్ ఒక వీఐపీనే అనే మోదీ తాజాగా అందుకు త‌గ్గ‌ట్లుగానే వ్య‌వ‌హ‌రించారు. త‌న కాన్వాయ్‌ను ఆపి మ‌రీ ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చారు మోదీ. నిన్న‌ ఆఫ్రిక‌న్ డెవ‌లప్‌మెంట్ బ్యాంక్ 52వ వార్షిక స‌మావేశాల‌ను ప్రారంభించేందుకు గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌కు వ‌చ్చారు. అనంత‌రం మోదీ కాన్వాయ్‌ గాంధీన‌గ‌ర్‌-అహ్మ‌దాబాద్ రోడ్డుపై వెళుతోంది. అదే సమయంలో ఓ అంబులెన్స్ అటుగా వచ్చింది. దాన్ని గ‌మ‌నించిన మోదీ ప్రొటోకాల్‌ను ప‌క్క‌నపెట్టి తన కాన్వాయ్‌ను ఆపేసి, అంబులెన్సుని ముందుగా వెళ్లేలా చేశారు.                     

  • Loading...

More Telugu News