: టీమిండియాకు నా సత్తా చూపిస్తా: పాక్ ఆటగాడు


పాకిస్థాన్ జట్టులో అదృష్టవశాత్తు స్థానం దక్కించుకున్న ఆటగాడు తుదిజట్టులో స్థానం సంపాదించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడు. పాక్ స్టార్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఫిట్ నెస్ పరీక్షలో విఫలం కావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతని స్థానంలో హారిస్ సొహైల్ ను ఎంపిక చేసింది. ఒక ఆటగాడు గాయపడి ఇంటికి పరిమితమైతే కానీ స్థానం సంపాదించని హారిస్ సోహల్ మాట్లాడుతూ, భారత్ తో మ్యాచ్ లో ఆడే అవకాశం వస్తే భారత్ కు తన సత్తా చూపిస్తానని చెప్పాడు. ప్రతి ఆటగాడు భారత్ పై బాగా ఆడాలని కోరుకుంటాడని, తనకు అవకాశం వస్తే, ఉత్తమ ఆటతీరు ప్రదర్శిస్తానని అన్నాడు. 2015లో జింబాబ్వేతో ఆడిన సందర్భంగా జట్టులో స్థానం సంపాదించుకున్న సొహైల్ తరువాత స్థానం కోల్పోయాడు. కాగా, జూన్ 4న టీమిండియాతో తొలి మ్యాచ్ లో పాక్ జట్టు తలపడనుంది. 

  • Loading...

More Telugu News