: ఉన్నట్టుండి పెరిగిన గోదావరి... స్నానం చేస్తున్న ఇద్దరు మృతి!


రాజమండ్రి- ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఉన్నట్టుండి ప్రవాహ వేగం పెరగగా, స్నానానికని వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. బ్యారీజీ వద్ద ఉన్న పిచుకల లంకలో ఈ ఘటన జరిగింది. నీటి మట్టం పెరగడంతో ఓ వ్యక్తి మరణించగా, మరో మహిళ గల్లంతైంది. ఇద్దరిని మాత్రం స్థానికులు కాపాడారు. గల్లంతైన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగానే నదిలో నీరు ఒక్కసారిగా పెరిగిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News