: పయ్యావుల కేశవ్ ను పరామర్శించిన బాలకృష్ణ
టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తల్లి ఓబులమ్మ (84) నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఓబులమ్మ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను 15 రోజుల క్రితం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె అంత్యక్రియలు అనంతపురం జిల్లాలోని పయ్యావుల స్వగ్రామం పెద్ద కౌకుంట్లలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పయ్యావులను టీడీపీ నేతలు పరామర్శించారు.
నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి ఆయనను పరామర్శించారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జితేంద్రగౌడ్, బీకే పార్థసారథి, గోనుగుంట్ల సూర్యనారాయణ, యామినీబాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, తిప్పేస్వామిలు పయ్యావుల కేశవ్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు.