: ఆమె ట్విట్టర్ టైమ్ లైన్ చూసి మీ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోండి... నేను ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నాను: సోనూ నిగమ్


తెల్లవారు జామున మసీదు నుంచి వచ్చే నమాజ్ తన నిద్రను పాడుచేసిందని చెబుతూ... మత విధానాలపై వ్యాఖ్యలు చేసి పెను వివాదానికి కారణమైన ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోనూనిగమ్‌ ట్విట్టర్ నుంచి వైదొలిగాడు. ట్విట్టర్ నుంచి వైదొలగకముందు ఆయన వరుసగా పలు ట్వీట్లుచేశాడు. ఈ ట్వీట్లు త్వరగా స్క్రీన్ షాట్లు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం...‘‘నా 70 లక్షల మంది ఫాలోవర్లకు గుడ్‌ బై. చాలా మందిని నొప్పిస్తూ నేను ట్విటర్‌ నుంచి తప్పుకుంటున్నా. నేను వైదొలగటంతో కొందరు శాడిస్ట్‌ లు సంతోషంగా ఉంటారు. నాకో విషయం బాగా అర్థమైంది. నిద్రపోతున్న వారిని లేపగలం. కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న వారిని లేపలేం.... మీడియా డివైడ్‌ అయిపోయింది. కొందరు జాతీయవాదులు మన చరిత్రను కొన్ని విషయాల నుంచి నేర్చుకోవాలని అనుకోవడంలేదు.

నాపై చాలా మంది ప్రేమ.. అనురాగం చూపిస్తారు. మరికొందరు అకారణంగా నిందలు వేస్తుంటారు....ఓ ఆర్మీ వాహనం ఎదుట ఓ మహిళ పెట్టిన ఫొటో గురించి ఎవరూ ఏమీ అనలేదు. కానీ పరేశ్‌ రావల్‌ విషయంలో మాత్రం ఆయన్ని తిట్టి పోశారు. అరుంధతి రాయ్‌ కి కశ్మీర్‌ పట్ల ఎలాంటి అభిప్రాయమైనా చెప్పే హక్కు ఉంది. అదే సమయంలో కోట్లాది భారతీయులకు ఆమె అభిప్రాయాన్ని తప్పా? కాదా? అని చెప్పే హక్కు ఉంటుంది కదా?.... అభిజీత్‌ భట్టాచార్య ఖాతా సస్పెండ్‌ చేస్తే, జేఎన్‌యూ విద్యార్థి షెహ్లా ట్విట్టర్‌ ఖాతాను కూడా సస్పెండ్‌ చేయాలి..... అన్ని విషయాలను ఒకవైపే ఎందుకు ఆలోచిస్తున్నారు? అందరూ ట్విట్టర్‌లోనే ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? నేను ట్విటర్‌ కు వ్యతిరేకిని కాను. అదో గొప్ప సామాజిక మాధ్యమం....ఇది థియేటర్లలో చూసే అశ్లీల చిత్రం లాంటిది.

ఒకవైపు మాత్రమే ఆలోచించే ప్రజలున్న దీని నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నేనే కాదు మనసున్న వారు ఎవరైనా ఇదే చేస్తారు...నాకు మతం లేదు. నాకు ఏది మంచి అనిపిస్తుందో అదే నా మతం. ఇంకెప్పుడూ ఏ విషయం గురించి స్పష్టత ఇవ్వడానికి ఇలా మెసేజ్‌ లు చేయను. మున్ముందు నాపై ఎలాంటి వివాదాలు ఉంటాయో తెలీదు. కానీ ట్విట్టర్‌ నుంచి మాత్రం ఇదే ఆఖరి వివాదాస్పద విషయం కావాలని కోరుకుంటున్నాను...ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్న వారుంటే మీ భాగస్వామి ట్విట్టర్‌ లో పెట్టే టైమ్‌ లైన్‌ ని చూసి వారి మనస్తత్వం ఏంటో తెలుసుకోండి. థ్యాంక్యూ ట్విట్టర్ ’’ అంటూ ఆయన వరుసగా ఏడు ట్వీట్లు చేశారు. అనంతరం ఆయన చెప్పినట్టుగా ఆయన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News