: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై ట్విట్టర్ ఆగ్రహం.. ఖాతా రద్దు


ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్యకు ట్విట్టర్ ఊహించని షాక్ ఇచ్చింది. అతని ఖాతాను నిలిపివేసింది. మహిళలకు సంబంధించి ఆయన అభ్యంతరకరమైన ట్వీట్లు చేస్తున్నారని... అవమానకరమైన భాషను వాడుతున్నారని... అందుకే ఆయన ఖాతాను రద్దు చేశామని ట్విట్టర్ తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, మహిళా జర్నలిస్టు స్వాతి చతుర్వేదిని ఉద్దేశిస్తూ అభిజీత్ గత ఏడాది విద్వేషపూరిత ట్వీట్లు చేశాడు.

దీంతో, సోషల్ మీడియాలో ఆయనపై ఆగ్రహం వ్యక్తమైంది. ఆయనపై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ట్వీట్లతో హోరెత్తించారు. జేఎన్ యూ విద్యార్థిని, హక్కుల కార్యకర్త షెహ్లా రషీద్ పై అభ్యంతరకర ట్వీట్లు చేశారు. ఆమె రెండు గంటలు గడిపేందుకు డబ్బులు తీసుకుని... కస్టమర్ కు సంతృప్తిని ఇవ్వలేదంటూ తీవ్రమైన కామెంట్లు చేశారు. తనను విమర్శిస్తున్న మహిళా నెటిజన్లపై కూడా వెకిలిగా ట్వీట్లు చేశాడు. ఈ నేపథ్యంలోనే, అతని ఖాతాను ట్విట్టర్ రద్దు చేసింది. 

  • Loading...

More Telugu News