: ఆదాయం పెరిగితే మంచిదేగా... ఆనందిద్దాం: చంద్రబాబు


ఎవరైనా రాష్ట్రానికి మరింత ఆదాయం రావాలనే కోరుకుంటారని, ఆదాయం పెరిగితే, ఆ మేరకు ఆనందం, ఆహ్లాదం రెండూ కలుగుతాయని అన్నారు. ఈ ఉదయం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. టూరిజం రంగాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రానికి ఎంతమంది టూరిస్టులు పెరిగితే, అంత ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. పరిశుభ్రతను ప్రతి వ్యక్తీ సొంత బాధ్యతగా తీసుకుని కృషి చేయాలని అన్నారు. పరిశుభ్రతను సంస్కృతిలో భాగంగా చూడాలన్నారు. పర్యాటక రంగం మరింతగా విస్తరించాలంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించడం తప్పనిసరని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News