: ఎన్నాళ్లకెన్నాళ్లకు... కృష్ణమ్మకు జలకళ!


ఎన్నో నెలల తరువాత కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తుండటంతో, విజయవాడ వద్ద జలకళ కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నిన్న మొన్నటి వరకూ నీటి ప్రవాహం కనిపించక, నదిలోని బండరాళ్లు కనిపిస్తూ ఉండగా, ఇప్పుడు ప్రవాహం పెరగడంతో రెండు నుంచి మూడు అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో ధ్యానబుద్ధ ఘాట్ వద్ద మెట్లను తాకుతూ నీరు నెమ్మదిగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు, నగర వాసులు సేదదీరేందుకు వస్తున్నారు. ఇటీవలి కాలంలో గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటమే తాజా నీటి ప్రవాహానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నీటిని వివిధ తాగునీటి పథకాలకు మళ్లించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News