: ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు కనిపించిందోచ్.. శాన్‌ఫ్రాన్సిస్కోలో దూసుకుపోయిన వాహనం!


అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ తన సెల్ఫ్ డ్రైవింగ్ కారును పరీక్షిస్తోందని గత కొన్ని నెలలుగా వార్తలు హల్ చేస్తున్నాయి. ఆ వార్తను నిజం చేస్తూ శాన్‌ఫ్రానిస్కో రోడ్లపై దూసుకుపోతున్న ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు వీడియోకు చిక్కింది. తెలుపు రంగు లెక్సస్ ఆర్ఎస్ 450 హెచ్ ఎస్‌యూవీ ఆ వీడియోలో ప్రయాణిస్తూ కనిపించింది. అందులో స్వతంత్రంగా పనిచేసే కంప్యూటర్ పరికరాలు అమర్చబడి ఉన్నాయి. కారులో ఉన్న ఆపిల్ ఉద్యోగి కారు పనితీరును పర్యవేక్షిస్తూ కనిపించారు. తాజాగా ఆపిల్ పరీక్షిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్లా, గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్ట్ ‘వేమో’కు గట్టి పోటీ కానుందని నిపుణులు చెబుతున్నారు. ఆ కారును  మీరూ చూడండి.

  • Loading...

More Telugu News