: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. భాగీరథి నదిలో పడిన బస్సు.. 21 మంది భక్తుల దుర్మరణం
మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. హిమాలయాల్లోని గంగోత్రిని దర్శించుకుని భక్తులతో వస్తున్న ఓ బస్సు ఉత్తరకాశి జిల్లాలోని నలుపని వద్ద అదుపు తప్పి భాగీరథి నదిలో పడింది. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో 20 మంది మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ, పోలీస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వారంతా ఇండోర్‌కు చెందినవారై ఉంటారని భావిస్తున్నారు. ఈనెల 12న చార్‌ధామ్ యాత్రకు బయలుదేరిన భక్తులు యమునోత్రి, గంగోత్రిని దర్శించారు. ప్రస్తుతం హరిద్వార్, అక్కడి నుంచి కేదారినాథ్ వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.