: రెండు కంటైనర్లలో తరలిస్తున్న పాము విషం పట్టివేత!
బంగ్లాదేశ్ నుంచి భారత్ కు రెండు కంటైనర్లలో అక్రమంగా తొలగిస్తున్న పాము విషాన్ని బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పశ్చిమబెంగాల్ లోని దక్షిణ దినజ్ పూర్ లో ఈ కంటైనర్లను పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని బీఎస్ఎఫ్ 41వ బెటాలియన్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ టిజి సిమ్టె తెలిపారు. విషాన్ని అక్రమంగా తరలిస్తున్న సుదెబ్ టిగ్గా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, రెండు కంటైనర్లను స్వాధీనం చేసుకున్నామని సిమ్టె తెలిపారు.