: రాఘవేంద్రరావు గారు మాటివ్వమంటే ఇచ్చాను: నటుడు వెన్నెల కిషోర్
తనను హీరో క్యారెక్టర్లు చేయవద్దని దర్శకుడు రాఘవేంద్రరావు మాటివ్వమని అడిగితేే, ‘చేయనని’ తాను మాటిచ్చానని ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ అన్నారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఓసారి సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు గారు నన్ను పిలిచి కామెడీ బాగా చేస్తున్నానని చెప్పారు. ‘హీరో పాత్రలు చేయనని మాటివ్వు’ అని ఆయన అడుగగా, ‘చేయనని మాటిచ్చా. సినీ రంగంలో చాలా మంది హాస్యనటులు ఉన్నారు. కొత్త నటులూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ ఆకట్టుకోవాలంటే కొత్తగా నటించాల్సి ఉంటుంది’ అన్నాడు వెన్నెల కిషోర్.